Captures d’écran:
Description
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులమైన మేము, ఇంతకుముందు ప్రథమ దైవగ్రంథము భగవద్గీత, తృతీయ దైవగ్రంథము ఖుర్‌ఆన్‌లోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాశాము. మూడు దైవగ్రంథములకు వివరమును వ్రాయవలెననునది నా ప్రగాఢ కోర్కె అయినందున ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలు (బైబిలు) గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాయుచున్నాము. ఇందులో వ్రాయు జ్ఞాన వివరము శాస్త్రబద్దమైనది మరియు సత్యసమేతమైనదని తెలుపుచున్నాను.
ఇక్కడ నేను సువార్తలలోని కొన్ని వాక్యములకే వివరమును వ్రాయుచున్నాను. ఎక్కడయితే మనుషులకు అర్థముకాని వాక్యముండునో, ఎక్కడయితే మనిషి వాక్యమును అర్థము చేసుకోవడములో పొరబడు అవకాశమున్నదో, ఇంకా కొందరు ఎక్కడయితే వాక్యమును తప్పుగా అర్థము చేసుకొన్నారో, అక్కడ ఆ వాక్యమును గురించి వివరించి వ్రాయదలచు కొన్నాము. ఆ విధముగా చేయడము దేవుని సేవలో ఒక భాగమైనందున నేను ఒక కలముగా ఉండగా, దేవుడే నా చేత ఈ పనిని చేయించుచున్నాడని తలచుచూ ఈ సేవ చేయుచున్నాను.